ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: వివిధ కారణాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మంచి ఆలోచనలతో జీవి తాన్ని గడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వి.సంకేత్‌ మిత్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్‌ జైలును మంగళవా రం సందర్శించారు. ఖైదీల ఆరోగ్య సమస్యలు, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఖైదీలు ప్రైవేట్‌ న్యా యవాదులను నియమించుకునే స్థోమత లేకుంటే ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కా ర్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ ప్రేమ్‌కుమార్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement