మెడికల్ బోర్డును పునరుద్ధరించాలి.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావా ల్సిన రూ.56వేల కోట్ల బకాయిలు వెంటనే వసూలు చేయాలి.
2025–26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన లాభాలు ప్రకటించి, అందులో నుంచి 40శాతం వాటా కార్మికులకు చెల్లించాలి.
సొంతింటి పథకం అమలు చేయాలి. ఇల్లు నిర్మించుకుంటే రూ.30లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి.
అధికారులకు ఇస్తున్నట్లుగా అలవెన్స్‌లపై ఆదాయపన్నును కంపెనే రీయింబర్స్ మెంట్ చేయాలి.
మారు పేర్ల సమస్య పరిష్కరించాలి.
చిన్నచిన్న పొరపాట్ల పేరుతో విజిలెన్స్ కేసుల పేరిట పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ కేసులు వెంటనే క్లియర్ చేయాలి.
డిస్మిస్ కార్మికులకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి.
క్యాడర్ స్కీం, ఉన్న ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి. ఇంకా ఇతర డిమాండ్లు నెరవేర్చాలి.
యాజమాన్యం, డిప్యూటీ సీఎల్సీకి
రేపు ఆర్‌ఎల్సీతో చర్చలు
విఫలమైతే సమ్మె తప్పదన్న నేతలు
మిగతా సంఘాల్లో భిన్నాభిప్రాయం
శ్రీరాంపూర్: సింగరేణిలో సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 8న యాజమాన్యానికి, 9న డిప్యూటీ సీఎల్సీకి సమ్మె నోటీస్ ఇచ్చింది. డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 22తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించింది. గుర్తింపు సంఘంగా గెలిచి రెండేళ్లు దాటినా కార్మికుల ప్రధాన డిమాండ్ల సాధనకు యాజమాన్యం ముందుకురావడం లేదని ఏఐటీయూసీ నేతలు ఆరోపిస్తున్నారు. స్ట్రక్చరల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన ఒప్పందాలూ అమలయ్యేలా యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడం లేదని విమర్శించారు. చాలాకాలంగా కార్మికుల 31 ప్రధాన డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈసారి సమ్మెతో వీటిని సాధిస్తామని పేర్కొంటున్నారు. కాగా, సమ్మె నోటీసులపై ఈ నెల 25న ఆర్‌ఎల్సీ చర్చలకు పిలిచింది. యాజమాన్యం, గుర్తింపు సంఘానికి మధ్య జరిగే ఈ చర్చల్లో తమ డిమాండ్లకు అంగీకరించకుంటే ఫెయిల్యూర్ రిపోర్ట్ తీసుకుని సమ్మెకు పోతామని ఏఐటీయూసీ నేతలు చెబుతున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త లేబర్‌కోడ్‌లు అమలవుతున్న ఈ తరుణంలో సమ్మె నోటీస్‌కు, సమ్మెకు మధ్య 60రోజుల గడువు ఉండాలనే నిబంధన అమలులో ఉందని తెలిసింది.
సమ్మైపె భిన్నాభిప్రాయాలు
సమ్మైపె మిగతా కార్మిక సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండున్నరేళ్లు అధికారం అనుభవించి నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమ్మె నోటీస్ ఇవ్వడంలో రాజకీయ దురుద్దేశం ఉందని టీబీజీకేఎస్, హెచ్‌ఎమ్మెస్, సీఐటీయూ ఆరోపిస్తున్నాయి. ఈ సమ్మెనూ ఐన్టీయూసీ తప్పుపడుతోంది. ఐక్యపోరాటాలే సింగరేణిలో నేడు శరణ్యమని, ఒంటరిగా సమ్మెకు వెళ్తే విఫలమై కార్మికులు నష్టపోతారని ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒంటెద్దు పోకడలతో కాకుండా అన్ని సంఘాలతో చర్చించి ఏకాభిప్రాయం మేరకే సమ్మె చేయాలని సూచిస్తున్నాయి.
ఇవే సమ్మె డిమాండ్లు..
నోటీస్ ఇచ్చిన గుర్తింపు సంఘం


