కాగజ్‌నగర్‌టౌన్: రాష్ట్రంలో చేపట్టే సర్ ప్రక్రియపై బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అవగాహన అవసరమని ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. పట్టణంలోని వినయ్ గార్డెన్‌లో మంగళవారం సర్ ప్రక్రియపై అవగాహన, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి జగన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఓటర్లు ఓటుహక్కు కాపాడుకునేలా పార్టీ శ్రేణులు చైతన్యవంతంగా పనిచేయాలని పిలు పునిచ్చారు. ఎస్‌ఐఆర్‌పై గ్రామాల్లో అవగాహన క ల్పించాన్నారు. అనంతరం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పోషించిన చారిత్రక పాత్రను ప్రజలకు వివరించాలని సూచించారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలన్నారు. యువత, మహిళలు అధిక సంఖ్యలో పార్టీలో చేరేలా కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోనే రు కోనప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న బలాన్ని మరింత విస్తరించేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


