పిల్లల రక్షణకు పోక్సో చట్టం | - | Sakshi
Sakshi News home page

పిల్లల రక్షణకు పోక్సో చట్టం

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

కెరమెరి: పిల్లల రక్షణ కోసమే పోక్సో చట్టం ఉందని, విద్యార్థినులకు చట్టాలపై అవగాహ న ఉండాలని ఆసిఫాబాద్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌ మిత్ర అన్నారు. మండలంలోని మోడి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలో ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చట్టాలపై అవగాహన కల్పించారు. రా జ్యాంగం, ప్రాథమిక హక్కులు, సైబర్‌ నేరా లు, సోషల్‌ మీడియాలో తీసుకోవాల్సిన జా గ్రత్తలు, గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌, బాల్య వివా హాల నిషేధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూల న గురించి వివరించారు. పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు పోక్సో చట్టం పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి వేధింపులకు గురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ప్రేందాస్‌, సర్పంచ్‌ ఆత్రం లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement