నీట్‌కు 89.5 శాతం మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

నీట్‌కు 89.5 శాతం మంది హాజరు

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివా రం నిర్వహించిన నీట్‌ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 353 మంది విద్యార్థులకు 316(89.5 శాతం) మంది హాజరు కాగా, 37 మంది గైర్హాజరయ్యారు. రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన కాగజ్‌నగర్‌ మండలానికి ఓ విద్యార్థినిని అధికారులు అనుమతించకపోవడంతో తిరిగివెళ్లిపోయింది. కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితిక పంత్‌, డీఈవో సచ్చిదానందచారి పరీక్ష తీరును పర్యవేక్షించారు. డీఎస్పీ అశోక్‌, సీఐ బాలాజీ వరప్రసాద్‌, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ లక్ష్మీనరసింహం, ప్రిన్సిపాల్‌ రహీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement