‘ఏఐటీయూసీతోనే కార్మిక హక్కులు’ | - | Sakshi
Sakshi News home page

‘ఏఐటీయూసీతోనే కార్మిక హక్కులు’

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

ఆసిఫాబాద్‌: కార్మిక హక్కుల సాధన ఏఐటీయూసీతోనే సాధ్యమవుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం అధ్యక్షు డు టి.దివాకర్‌ అధ్యక్షతన ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఉపేందర్‌ మాట్లాడుతూ వందేళ్లు పూర్తి చేసుకున్న ఏకై క కార్మిక సంఘం ఏఐటీయూసీ అ న్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతి రేక విధానాలు అవలంబిస్తుందని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. నాలు గు లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి, 44 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు బి.సుధాకర్‌, మధుసూదన్‌, భాస్కర్‌, బాలేశ్‌, షకీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement