ఆసిఫాబాద్‌అర్బన్: , రాజీ మార్గమే రాజమార్గమని డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ వీరయ్య పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూ చించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కక్షిదారులు, అడ్వకేట్‌లు, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, అట వీ, లీగల్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. 1,488 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోగా, ఒప్పందం ద్వారా మొత్తం రూ.44,32,639 సమకూరినట్లు ఈ సందర్భంగా వీరయ్య పేర్కొన్నారు.


