‘సర్‌’పై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై అవగాహన కల్పించాలి

Jun 21 2026 12:55 AM | Updated on Jun 21 2026 12:55 AM

● కలెక్టర్‌ హరిత ● జిల్లా కేంద్రంలో 2కే రన్‌

ఆసిఫాబాద్‌: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (సర్‌) ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించా లని కలెక్టర్‌ కె.హరిత సూచించారు. ఈ నెల 25నుంచి జూలై 24వరకు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం నేపథ్యంలో శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, అధికారులతో కలిసి 2కే రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి అంబేడ్కర్‌ చౌక్‌, వివేకానంద చౌక్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 678పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బూత్‌ స్థాయి అధికారులు విధిగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓట రుగా నమోదు చేయడంతో పాటు మార్పులు, చే ర్పులు సక్రమంగా చేపట్టాలని తెలిపారు. బీఎల్‌వో యాప్‌ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, ఓటరు సవరణ కార్యక్రమం బాధ్యతాయుతమైన కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని సూచించారు. తహసీల్దార్‌ రియాజ్‌అలీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అధికారులకు అవగాహన

కెరమెరి: మండలంలోని కెస్లాగూడ రైతువేదికలో ఎన్యుమరేషన్‌, బీఎల్వో యాప్‌లపై బూత్‌ స్థాయి అధికారులు, ఏజెంట్లు, సూపర్‌వైజర్లకు కలెక్టర్‌ హరిత అవగాహన కల్పించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూ చించారు. ఈ సందర్భంగా బూత్‌ స్థాయి అధికారులకు కిట్లు అందజేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. వార్డులు, వైద్యులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలందించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. తహసీల్దార్‌ నాగార్జు న, వైద్యాధికారి రియాన్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement