ఆసిఫాబాద్‌రూరల్: నీట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు 353మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 250 మంది బాలికలు, 103 మంది బాలురున్నారు. ఒక్కో గదికి 30 మంది చొప్పున 15 గదులు కేటాయించారు. పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులను ఉదయం 11నుంచి 1.30గంటల వరకు బయోమెట్రిక్ ద్వారా సెంటర్‌లోకి అనుమతిస్తారు. 28మంది ఇన్విజిలేటర్లు, ఒక పరిశీలకుడు, ఇద్దరు సీఎస్‌లతోపాటు సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
విద్యార్థులకు సూచనలు
పకడ్బందీగా నిర్వహిస్తాం
నీట్ నిర్వహణకు అన్ని ఏర్పాటు చేశాం. 316మంది విద్యార్థులు పరీక్షకు హాజ రు కానున్నారు. నిబంధనల మేరకు విద్యార్థులను క్షుణంగా తనిఖీ చేసి బయోమెట్రిక్ హాజరు నమో దు చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతిస్తాం.
– లక్ష్మీనరసింహం, నీట్ సిటీ కోఆర్డినేటర్


