అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కెరమెరి: గుడిసెల్లో నివాసం ఉంటూ కష్టాలతో కాలం వెల్ల దీస్తున్న కెరమెరి మండలం చిన్నుగూడ గ్రామస్తులకు ఎట్ట కేలకు ఊరట దక్కింది. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సమస్యల వలయంలో చిన్నుగూడ’ కథనానికి కలెక్టర్ కె.హరిత స్పందించారు. హౌసింగ్ డీఈతో సర్వే చేయించి అర్హులైన వారందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, రూ.20లక్షలతో బీటీ రోడ్డు నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు డీఆర్‌డీవో దత్తారావు ‘సాక్షి’కి తెలి పారు. శుక్రవారం ఉదయమే ఎంపీడీవో అంజద్‌పాషా గ్రామానికి వెళ్లి స్థానికులతో సమావేశమయ్యారు. ఇళ్ల ఎదుట మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి నీరు నిలువకుండా మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి హరీశ్ ఉన్నారు.


