మెనూ పాటించకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

మెనూ పాటించకుంటే చర్యలు

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

రెబ్బెన: ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా మెనూ పాటించాలని, లేని పక్షంలో ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. మండలంలోని వంకులం ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ప్రతీ పాఠశాలలో మధ్యా హ్న భోజనాలకు సంబంధించిన మెనూ ప్రదర్శించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ వేయాలన్నారు. మండలాల వారీగా ఎఫ్‌ఆర్‌ఎస్‌పై రివ్యూ చేసి గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ అబ్దుల్‌ లతీఫ్‌, ఎంఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement