కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపల్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. కాగజ్‌నగర్ మున్సి పాలిటీ పరిధిలో శుక్రవారం పర్యటించారు. మున్సి పల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పన్ను వసూళ్లు, ప్రజాసేవల అమలు తీరును సమీక్షించా రు. అనంతరం మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, వార్డు కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రజ లకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. అలాగే ఎల్లగౌడ్‌తోటలోని చిల్డ్రన్స్ పార్క్‌ను సందర్శించా రు. పరిశుభ్రత, పచ్చదనం, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. తొలిసారిగా వచ్చిన అదనపు కలెక్టర్‌ను అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈ రమాదేవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్, పర్యావరణ ఇంజినీర్ డి.ప్రణీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


