కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టులో వేసిన పిటిషన్ రద్దు చేసుకోవాల నే డిమాండ్‌తో త్వరలో ఎస్పీఎం గేటు ఎదుట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని జేఏసీ సంఘాల నాయకులు తెలిపారు. పట్టణంలో ని దీక్ష శిబిరం వద్ద శుక్రవారం జేఏసీ నాయకులు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ వర్కర్స్ యూనియన్ల నుంచి ఇద్దరి చొప్పున కమిటీ ఏర్పాటు చేశామని, జేఏసీ కన్వీనర్‌గా గోగర్ల రాములు, కోకన్వీనర్‌గా వెంకటేశంను ఏకగ్రీవంగా ఎ న్నుకున్నామని తెలిపారు. సభ అనంతరం చలో ఆదిలాబాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ ముట్టడి చేపడుతామన్నారు. శ్రీనివాస్, సురేందర్, రమణయ్య, నానాజీ, వెంకటేశం, ముంజం శ్రీనివాస్, రాజేశ్, ఓదెలు వేణుగోపాల్, కన్నయ్య, పోచం పాల్గొన్నారు.


