అట్టహాసంగా బాక్సింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా బాక్సింగ్‌ పోటీలు

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని బాలబారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి బాక్సింగ్‌ పోటీలు అట్టహాసంగా నిర్వహించా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ వి భాగాల్లో ప్రతిభ చూపిన 25 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. అనంతరం విజేతలకు బ హుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ దస్తగిర్‌, ముత్తు బాక్సింగ్‌ క్లబ్‌ చైర్మన్‌ శివకుమార్‌, కార్యదర్శి మదురై శేఖర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జయేందర్‌, ఎస్సై మోహన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement