ఫిట్‌‘లెస్‌’ బస్సులు! | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌‘లెస్‌’ బస్సులు!

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

స్కూల్‌ బస్సుకు తప్పనిసరిగా పసుపు రంగు వేయించి నాలుగు వైపులా పాఠశాల పేరు స్పష్టంగా రాయించాలి.

డ్రైవర్‌కు కనీసం నాలుగేళ్ల అనుభవం, హె వీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. డ్రైవర్‌ వివరాలను రవాణా శాఖకు అందించాలి. అ లాగే అతడు కచ్చితంగా యూనిఫాం ధ రించాలి.

బస్సులు, విద్యార్థులను తరలించే ఏ వా హనంలోనైనా పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదు. మూడు నెలలకోసారి డ్రైవర్‌కు ఆరోగ్యపరీక్షలు చేయించాలి.

విండ్‌ స్క్రీన్‌, వైపర్‌, లైటింగ్‌, మెకానికల్‌ కండిషన్‌ క్రమం తప్పకుండా తనిఖీ చేసి రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

పాఠశాల ప్రాంగణంలో పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి.

పిల్లల సంరక్షణ బాధ్యత చూసేందుకు బస్సులో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాలి.

ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం వాహన సామర్థ్య పరీక్షలపై దృష్టిపెట్టని ప్రైవేట్‌ యాజమాన్యాలు జిల్లాలో 52 బస్సులకే ఫిట్‌నెస్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: నూతన విద్యాసంవత్సరం ప్రా రంభానికి సమయం ఆసన్నమవుతున్నా జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల ఫి ట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా బ స్సులు సామర్థ్య పరీక్షలకు నోచుకోలేదు. విద్యార్థులను తరలించేందుకు 91 బస్సులు వినియోగిస్తుండగా, ఇందులో ఇప్పటివరకు కేవలం 52 బస్సుల కు మాత్రమే ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించారు. మరో వైపు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా మే 15 నుంచి జూన్‌ 12 వరకు రవాణా శాఖ అధికారులు వా హన సామర్థ్య పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు.

జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లావ్యాప్తంగా 116 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వాటిలో 31,116 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని తరలించేందుకు యాజమాన్యాలు 91 బస్సులను నడిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పాఠశాలలు, కళాశాలలు మూసి ఉండటంతో యా జమాన్యాలు బస్సులను సాధారణంగా వాడకుండా ఉంచుతాయి. చాలామంది అద్దె కోసం సభలు, స మావేశాలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తుంటాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల ల ప్రారంభం నాటికి ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించడం తప్పనిసరి. ఆ తర్వాతే బస్సులను రోడ్లపైకి అనుమతిస్తారు. ఇప్పటివరకు జిల్లాలోని 91 బస్సుల్లో కేవలం 52 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించుకోగా, మిగిలిన 39 బస్సులకు త్వరగా పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. జూన్‌ 12వ తేదీ తర్వాత ఫిట్‌నెస్‌ పత్రాలు, సరైన అనుమతులు లేని బస్సులు రోడ్లపై తిరిగితే సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

తల్లిదండ్రులపైనా బాధ్యత

చిన్నారులను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపించే తల్లి దండ్రులు పాఠశాలలో సదుపాయాలు, తరగతి గ దులు, బోధనా విధానంతోపాటు ప్రైవేట్‌ బస్సులపైనా దృష్టి సారించాలి. బస్సులు కండిషన్‌లో ఉ న్నాయా.. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారా..? అనే విషయాలపై ఆరా తీయాలి. అర్హత కలిగిన డ్రైవర్‌ ఉన్నారో లేదో గమనించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఆటోలు, ఇతర వాహనాల్లో పంపించేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.

నిబంధనలు ఇవే..

Advertisement
 
Advertisement
Advertisement