కెరమెరి: షీర్ వాల్ టెక్నాలజీతో 15 రోజుల్లో నే కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల సీఎం పర్యట నలో నిర్మాణ పనులు సైతం పరిశీలించారని పేర్కొన్నారు. బుధవారం కాంక్రీట్ పోయగా, గురువారం డీషెటరింగ్ చేసినట్లు వివరించా రు. సివిల్ పనులన్నీ పూర్తయ్యాయని, మిగిలి న పనులు త్వరలో చేపడతామని తెలిపారు. శుక్రవారం హౌసింగ్ అధికారులు ఇంటిని పరిశీలించారు. త్వరలో గృహ ప్రవేశానికి సిద్ధం చేసుకోవచ్చని హౌసింగ్ డీఈ వేణుగో పాల్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీశ్‌కుమార్, సర్పంచ్ శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు.


