పర్సనల్‌ హెచ్‌వోడీగా కిరణ్‌బాబు బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

పర్సనల్‌ హెచ్‌వోడీగా కిరణ్‌బాబు బాధ్యతలు

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా పర్సనల్‌ హెచ్‌వో డీగా డీజీఎం కిరణ్‌బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హెచ్‌వోడీగా పనిచేసిన ఎస్‌వీ రాజేశ్వర్‌రావు ఎస్‌టీపీపీకి బదిలీ కాగా.. అక్కడ పనిచేస్తున్న కిరణ్‌బాబు బెల్లంపల్లి ఏరియాకు వచ్చారు. డిపార్టుమెంట్‌ ఉద్యోగులు నూతన డీజీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎస్‌టీపీపీకి బదిలీపై వెళ్తున్న పర్సనల్‌ డిపార్టుమెంట్‌ డీవైపీఎం రాజేశ్వర్‌రావును శుక్రవారం గోలేటి టౌన్‌షి ప్‌లో జీఎం శ్రీరమేశ్‌, అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్‌ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్‌, డీజీఎంలు ఉజ్వల్‌కుమార్‌, కిరణ్‌బాబు, మదీనా బాషా, అన్ని విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement