తప్పిపోయిన బాలిక.. తల్లికి అప్పగింత | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బాలిక.. తల్లికి అప్పగింత

Feb 16 2026 7:25 AM | Updated on Feb 16 2026 7:25 AM

తప్పిపోయిన బాలిక..  తల్లికి అప్పగింత

తప్పిపోయిన బాలిక.. తల్లికి అప్పగింత

కౌటాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్థా నది ఒడ్డునున్న శ్రీసిద్ధి హనుమాన్‌ ఆలయంలో ఆదివారం నిర్వహించిన జాన జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌–2 గ్రామానికి చెందిన శాంతి మిసీ్త్ర రెండేళ్ల కుమార్తె జాతరలో తప్పిపోయింది. ఈ విషయం పోలీసుల దృష్టి కి రావడంతో కౌటాల ఎస్సై చంద్రశేఖర్‌ పోలీ స్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి బాలికను గు ర్తించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలి పారు. భారీ బందోబస్తు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహించామని ఎస్సై తెలిపారు. భక్తులు నదిలో లోతు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. నిర్వాహకుడు బొమ్మకంటి మహేశ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement