స్వతంత్రులే కీలకం!
ఆసిఫాబాద్: జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ పీఠాల ఎంపిక ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాల పీఠముడి వీడక పోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. మున్సిపల్ పీఠం కై వసం చేసుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీసీ జనరల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పలువురు ఆశావహులు చైర్మన్ పదవికోసం ఉవ్విళ్లూరుతున్నారు.
ఆసిఫాబాద్‌లో బల్దియాలో ఇలా..
తొలిసారి ఏర్పడిన జిల్లా కేంద్రంలోని ఆసిఫాబా ద్ మున్సిపాలిటీలో 20వార్డులకు గాను బీఆర్‌ఎస్ తొమ్మిది, కాంగ్రెస్ ఏడు, స్వంతంత్రులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ చైర్మన్ పీఠానికి మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్ల మద్దతు తప్పనిసరిగా మారింది. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఎక్స్‌అఫీషియో ఓటు ఉండడంతో బీఆర్‌ఎస్ బలం 10కి చేరింది. మ్యాజిక్ ఫిగర్‌కు చేరాలంటే ఈ పార్టీకి 11 మంది అభ్యర్థుల మద్దతు అవసరం. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు కేవలం ఒక అభ్యర్థి మద్దతు అవసరముండగా, కాంగ్రెస్‌కు నలుగురు అభ్యర్థుల అవసరముంది. కాగా, రెండు రోజులుగా ప్రధాన పార్టీలు స్వతంత్రుల మద్దతు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాయి. స్వతంత్రులకు చైర్మన్ పీఠం ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. రెండు పార్టీల అభ్యర్థులను శిబిరాలకు తరలించి, స్వంతంత్రుల మద్దతు కూడగట్టుకునేందుకు బేరసారాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, బల్దియా పీఠం కై వసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ నుంచి జిల్లాలోని ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి బీఆర్‌ఎస్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాగా, స్వతంత్రులు తమ మద్దతు తెలిపేందుకు ఏకంగా చైర్మన్ పదవినే ఆశి స్తున్నట్లు తెలుస్తోంది.
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో..
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30వార్డులుండగా.. బీఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ తొమ్మిది, బీజేపీ ఐదు, ఎంఐఎం ఒకటి, స్వంతంత్రులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ మెజార్టీ మార్క్ చేరుకోవాలంటే 16 మంది సభ్యుల మద్దతు అవసర ముంది. కాంగ్రెస్, బీజేపీ కలిస్తే బల్దియాలో పాగా వేసే అవకాశాలున్నాయి. కాగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు వ్యూహాలకు పదు ను పెడుతున్నారు. రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తుండగా కాగజ్‌నగర్ చైర్మన్ పీఠం ఏ పార్టీ సొంతం చేసుకుంటుందో నేడు తేలనుంది.
నేడు ఎన్నిక ప్రక్రియ ఇలా..
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సి పాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవా రం నిర్వహించేందుకు జిల్లా అధికారులు అ న్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి చట్టా ల ప్రకారం కౌన్సిలర్ల సమావేశంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు పోటీ పడతారు. మెజార్టీ కౌన్సిల ర్ల మద్దతుతో విజేత ఎంపికవుతారు. ఆర్డీవో స్థాయి అధికారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయాల్లో సభా సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత కౌన్సిలర్ల అటెండెన్స్ చూస్తా రు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కోరం ఉండాలి. పోటీ చేసే అభ్యర్థులకు పార్టీల బీఫామ్ ఇస్తారు. అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కౌన్సి లర్ల సీటింగ్ ఏర్పాటు చేస్తారు. పూర్తి బందోబస్తు మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తా రు. పోలీసులు మున్సిపల్ కార్యాలయాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నా రు. జిల్లాలో ఇప్పటికే 30 పోలీస్ ఆక్ట్ అమలు లో ఉండగా, కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
విప్ జారీ చేసిన పార్టీలు
తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు చేజారకుండా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు విప్ జారీ చేశాయి. అయినప్పటికీ ఆయా పా ర్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు ఎటు వైపు ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల రా జకీయాలు ఆసక్తికరంగా మారాయి. మున్సి పల్ చైర్మన్ ఎంపికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ మొదలైంది.


