శతాధిక వృద్ధురాలి మృతి
కెరమెరి: మండల కేంద్రానికి చెందిన శతాధి క వృద్ధురాలు సయ్య ద్ రుఖియా బేగమ్ (106) ఆదివారం మ రణించింది. శనివా రం రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులతో ముచ్చటించాక ని ద్రించింది. ఆదివారం ఉదయం 6గంటల వ రకు కూడా నిద్ర లేవకపోవడంతో ఆమె కోడలు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. 106 ఏళ్ల వయస్సులోనూ రుఖియా బేగ మ్ కళ్లజోడు పెట్టుకోలేదు. ఎలాంటి వ్యాధికీ గురికాలేదు. ఇటీవల ఆమె 106వ జన్మదిన వేడుకులను కూడా కుటుంబీకులు జరిపించా రు. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ముగ్గు రు కూతుళ్లున్నారు. ఒక కుమారుడు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సయ్యద్ అబ్దుల్ కలాం కాగా, మరో కొడుకు అబ్దుల్ ఫయ్యాజ్ క్లాస్ వన్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు.


