‘భరోసా’ లేని కౌలు | - | Sakshi
Sakshi News home page

‘భరోసా’ లేని కౌలు

Feb 16 2026 7:25 AM | Updated on Feb 16 2026 7:25 AM

‘భరోసా’ లేని కౌలు

‘భరోసా’ లేని కౌలు

పెరిగిన విత్తన, ఎరువుల ధరలు

ఏటా పెరుగుతున్న ఆర్థిక భారం

జిల్లాలో 30 వేల మంది రైతులు

వర్తించని రైతు సంక్షేమ పథకాలు

తిర్యాణి: సొంత భూమి లేకపోయినా సాగునే న మ్ముకుని యజమానుల వద్ద కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. ఏటా కౌలు ధరలు పెరుగుతుండటం, పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి సాగు చేస్తుండడం, చివరకు పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడటంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. సాధారణంగా అరెకరం, ఎకరం ఉన్న చిన్నకారు రైతులే ఇతర రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ‘ఆత్మీయ భరోసా’ పేరిట రూ.12వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దీంతో కొంతమందికి మేలు జరిగే అవకాశమున్నా ఈ పథకం పూర్తిస్థాయిలో కొనసాగకపోవడంతో ఎలాంటి సహాయం అందడం లేదు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 30వేలకు పైగా కౌలు రైతులున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.

అడుగడుగునా కష్టాలే..

కౌలు రైతులకు సీజన్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలోని ప్రతీ ప్రక్రియను ఆన్‌లైన్‌ చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు నుంచి పంట విక్రయాల వరకు పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే చేపడుతున్నారు. ఈ క్రమంలో పాసు పుస్తకాల జిరాక్స్‌ ప్రతిని ఇచ్చేందుకు కూడా భూయజమానులు వెనుకాడుతున్నారు. దీంతో ప్రభుత్వ రాయితీలు పొందలేక, పంటను అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించి కౌలు రైతులు మోసపోతున్నారు. పెట్టుబడి కోసం బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. దీనికి తోడు వా నాకాలం, యాసంగి సీజన్లలో ప్రకృతి వైఫరిత్యాలతో పంటలు నష్టపోతే కౌలు రైతుకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు. ఇన్సూరెన్స్‌ సదుపాయం, పంట నష్టపరిహారం వర్తించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.

ఐదెకరాలు సాగు చేస్తున్న

నాకున్న 20 గుంటల భూమికి తోడు మా ఊరిలోనే రూ.50వేలకు ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఏటా పత్తి సాగు చేస్తున్న. కౌలు కాకుండా సాగుకు మరో రూ.80వేల వరకు ఖర్చవుతోంది. మొత్తంగా ఐదెకరాలకు రూ.1.30లక్షల పెట్టుబడి పెడుతున్న. అకాల వర్షాలు కురిసినా, దిగుబడి సరిగా రాకపోయినా పెట్టుబడి ఖర్చులు కూడా దక్కడం లేదు. పండించిన పంటను మార్కెట్‌లో అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నం. ఈ ఏడాది దిగుబడి తగ్గి రూ.30వేల నష్టం వచ్చింది. ప్రభుత్వం కౌలు రైతులకూ రైతుబంధు, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి లాంటి సంక్షేమ పథకాలు వర్తింపజేసి ఆదుకోవాలి.

– కోట సుభాష్‌, కౌలు రైతు, అమీన్‌గూడ

కౌలు ధరలు ఇలా..

తమకున్న అరెకరం, ఎకరానికి తోడుగా మరి కొంత భూమి సాగు చేసేందుకు కౌలుపై ఆధారపడిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారితోపాటు ఉద్యోగులు, వ్యాపారులు తమ భూములను చిన్న రై తులకు కౌలుకు ఇస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కౌ లు ధరలు రైతులకు అందుబాటులో ఉండగా ప్ర స్తుతం యజమానులు అమాంతంగా పెంచేశా రు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధుతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌ నిధి కూడా భూయజమానులకే దక్కుతోంది. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందడం లేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఉపాధిహామీ పథకంలో 20 రోజు ల పనిదినాలు పూర్తి చేసిన భూమిలేని నిరుపేదలను అర్హులుగా గుర్తించింది. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మొదటి విడతగా రూ.6వేలు అందించింది. ఏడాదికి రెండు విడతల్లో ‘భరోసా’ అందించా ల్సి ఉండగా, పైలెట్‌ గ్రామాలకూ ఒక్కసారే ని ధులు విడుదలయ్యాయి. పైలెట్‌ గ్రామాల్లోనూ నిధులు అంది రెండేళ్లు అవుతుండడంతో లబ్ధిదా రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో మొ త్తం 19,082 మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించినా ఫలితం దక్కడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement