సామర్థ్యం.. సాధించేనా? | - | Sakshi
Sakshi News home page

సామర్థ్యం.. సాధించేనా?

Feb 16 2026 7:25 AM | Updated on Feb 16 2026 7:25 AM

సామర్థ్యం.. సాధించేనా?

సామర్థ్యం.. సాధించేనా?

‘ప్రాథమిక’ విద్యార్థులపై ఫోకస్‌ ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్షకు సన్నద్ధం ఇప్పటికే రెండుస్లారు మాక్‌టెస్ట్‌ 26న ఫౌండేషన్‌ లెర్నింగ్‌ స్టడీ పరీక్ష

ఆసిఫాబాద్‌ రూరల్‌: ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు జి ల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మంచి సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు మూడోతరగతి వి ద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వీరికి రెండుసార్లు మాక్‌ టెస్టులు నిర్వహించారు. 2024 న్యాస్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ సర్వే) ఫలితాలు, పాఠశాల స్థాయిలో లోటుపాట్లు, విద్యార్థులు సా మాజిక, ఆర్థిక పరిస్థితులను విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 26న ఎస్‌సీఈఆర్టీ జాతీయ స్థాయిలో మూడో తరగతి విద్యార్థులకు భాష, గణితంలో సామర్థ్యాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ (ఫౌండేషన్‌ లెర్నింగ్‌ స్టడీ) నిర్వహించనుంది.

అంచనా కోసం మాక్‌ టెస్ట్‌

అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే ప్రణాళికలో భాగంగా గత డిసెంబర్‌లో జిల్లా స్థాయిలో మూడోతరగతి విద్యార్థులకు బేస్‌లైన్‌ ఎఫ్‌ఎల్‌ఎస్‌ మాక్‌ టెస్ట్‌ను భాష, గణితంలో నిర్వహించారు. విద్యార్థు ల పఠన అవగాహన, గణిత సామర్థ్యాలు ఎస్‌ఈఆర్టీ, ఎన్‌సీఈఆర్టీ నిర్దేశించిన అభ్యసన ఫలితాలను విశ్లేషించారు. కాగా, మాక్‌టెస్ట్‌లో ఆశించిన ఫలితా లు రాలేదని సమాచారం. దీంతో విద్యార్థి స్థాయిలో విడివిడిగా అధ్యయనం చేసి అవసరమైన అకడమిక్‌ పరంగా సామర్థ్యాల పెంపుపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల నిర్వహించిన మాక్‌టెస్ట్‌లో విద్యార్థుల సామర్థ్యాలు ఏ మేరకు పెరిగాయనేది తెలియనుంది. ఈ తర్వాత లోటుపాట్లు సరిచేసి ఎన్‌సీఈఆర్టీ ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఎఫ్‌ఎల్‌ఎస్‌ టెస్ట్‌కు కూడా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తారు.

డ్యూయల్‌ పీరియడ్‌

జిల్లాలో 532 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. వీటిలో మూడో తరగతి విద్యార్థులు 8,512 మంది ఉన్నారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలలో అమలు చేయనున్న రోజువారీ ద్వికాలిక (డ్యూయల్‌ పీరియడ్‌) విధానం ద్వారా మూడో తరగతి విద్యార్థులకు ఉదయం అభ్యసన బోధన, మధ్యాహ్నం నైపుణ్యాల ఆధారంగా మూల్యాంకనం చేపట్టనున్నారు. దీంతో విద్యార్థులు నేర్చుకున్న అంశంపై సామర్థ్యం ఆదేరోజు నిర్ధారణ అవుతుంది. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో రీడ్స్‌ అండ్‌ కౌంట్స్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక కథలు, పరిసరాల ఆధారంగా పఠన కార్యకలాపాలు, దైనందిన జీవితాలకు అనుసంధానమైన గణిత సమస్యలు సహచర విద్యార్థుల ద్వారా అభ్యాసం (పీర్‌ లర్నింగ్‌) లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తారు.

మంచి ఫలితాలు సాధిస్తాం

జిల్లాలోని మూడోతరగతి విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎస్‌కు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. సామర్థ్యాలు సాధించేందుకు అవసరమైన ప్రణాళికకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేస్తున్నారు. ఇప్పటికే మాక్‌ టెస్ట్‌ నిర్వహించాం. ఎప్‌ఎల్‌ఎస్‌లో మంచి ఫలితాలు సాధిస్తాం.

– శ్రీనివాస్‌,

జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి

26న ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా మూడోతరగతి విద్యార్థుల కోసం ఫౌండేషన్‌ లర్నింగ్‌ స్టడీ టెస్ట్‌ను ఈ నెల 26న నిర్వహించనున్నట్లు పాఠశాల వి ద్యాశాఖ డైరెక్టర్‌, రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. మూడోతరగతి విద్యార్థుల్లో భాష నైపుణ్యాలు (తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ), గణిత నైపుణ్యాలు అంచనా వేయనున్నట్లు తెలిపారు. ఏ మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఆ మాధ్యమంలో భాషా నైపుణ్యాలను అంచనా వేస్తా రు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలల్లోని మూడోతరగతి విద్యార్థులకు ఈ ఎఫ్‌ఎల్‌ఎస్‌ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement