ఘనంగా మాజీ సైనికుల దినోత్సవం
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలో బుధవారం మాజీ సైనికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శివకుమార్ మాట్లాడుతూ జిల్లాలో మాజీ సైనికుల దినోత్సవాన్ని జరుపుకో వడం చాలా సంతోషకరమన్నారు. ఏటా జనవరి 14న ఆర్మీ వెటరన్స్ డే సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని సూచించారు. యూనిఫాం లేకున్నా ఎప్పటికీ దేశంపై వారి నిబద్ధత మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పియూష్ మండల్, విశ్వజిత్, కృపా, విజయ్, నరేందర్, పురుషోత్తం, ఉత్తమ్, సుశాంత్, బిపుల్, సర్వీస్ సోల్జర్ శ్రవణ్, సాయి, జావిద్, నజ్రుల్‌నగర్ ఉప సర్పంచ్ సమిర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


