ఎడ్లబండ్ల పోటీల్లో చెర్లపల్లి విజేత
చెన్నూర్‌రూరల్: ప్రతీ సంవత్స రం మాదిరిగానే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలోని లింగంపల్లి గ్రామంలో బుధవారం ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 30 ఎడ్లబండ్లు పందెంలో పాల్గొన్నాయి. బెల్లంపల్లి మండలం చెర్లపల్లికి చెందిన మాదాసు శివ ఎడ్లబండి మొదటి, లింగంపల్లి గ్రామానికి చెందిన జీళ్ల రవి ఎడ్లబండి ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. కాసిపేటకు చెందిన ఎడ్లబండి తృతీయ స్థానంలో నిలిచింది. ప్రథమ బహుమతి రూ.12వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ బహుమతి రూ.8వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంగ రమేష్, ఉప సర్పంచ్ జీళ్ల తిరుపతి, కిష్టంపేట సర్పంచ్ రావుల తిరుమల, తిరుపతి, ఉప సర్పంచ్ మహేష్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బొమ్మ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


