చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ ఇన్‌చార్జి సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాంసి బస్టాండ్ ఏరియాలో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి వద్ద దాదాపు రూ.8వేల విలువ గల రెండు చైనా మాంజా చరకాలు, 14 ప్యాకెట్ల చైనా మాంజ లభించినట్లు పేర్కొన్నారు. అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
మందమర్రిలో మరొకరిపై..
మందమర్రిరూరల్: పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గల పతంగుల దుకాణంలో చైనా మాంజా విక్రయిస్తున్న నిర్వాహకుడు కొక్కుల మధుపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంతోష్ తెలిపారు. బుధవారం దుకాణంలో తనిఖీ నిర్వహించగా మూడు బెండళ్ల చైనా మాంజా లభ్యమైనట్లు తెలిపారు. మాంజాను స్వాధీనం చేసుకుని నిందితుడిపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి పూచీకత్తుపై విడుదల చేశామన్నారు.


