● జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి ● రంగవల్లులతో కళకళలాడిన
ఎస్పీఎంలో భోగి మంటలు
కాగజ్‌గనర్‌టౌన్: పట్టణంలో ఎస్పీఎం క్లబ్‌లో బుధవారం తెల్లవారుజామున పేపర్ మిల్లు యూనిట్ హెడ్ ఏకే మిశ్రా ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేశారు. ఎస్పీఎం అధికారులు, కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అలాగే పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా నుంచి మార్కెట్ ఏరియాల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హరిదాసు వేషధారణలో విద్యార్థులు కాలనీల్లో పర్యటించారు. వీరికి కాలనీ వాసులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్పీఎం జీఎం కమర్షియల్ అనిల్‌కుమార్, గిరి, రమేశ్‌రావు, సురేందర్, గిరిశ్‌రాయ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు గిరీశ్‌కుమార్, సంతోష్, మురళీ, పుల్లూరి శంకర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
పండుగ విశిష్టత
సంక్రాంత్రి పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమిస్తాడు. నదుల్లో స్నానాలచరించడం శ్రేష్ఠంగా భావిస్తారు. తల స్నానంతో పీడలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే చిన్నారులకు భోగి పళ్లు పోయడం ద్వారా వారిపై ఉన్న దోషాలు తొలగిపోతాయని భావిస్తారు. నువ్వులు, బెల్లం కలిపిన పిండి వంటలను భుజిస్తారు. మహిళలు గౌరీ దేవిని పూజిస్తారు. ముత్తైదువలు నోములు నోముకుంటారు. ఇక శుక్రవారం కనుమ జరుపుకోనున్నారు.
ఆసిఫాబాద్‌అర్బన్: మూడు రోజుల పండుగ సంక్రాంతి సందడి మొదలైంది. తొలిరోజు జిల్లావ్యాప్తంగా భోగిని ఘనంగా జరుపుకొన్నారు. పల్లెలతోపాటు జిల్లా కేంద్రంలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఇళ్ల లొగిళ్లు రంగవల్లులతో నిండిపోయాయి. గొబ్బెమ్మలతో అలంకరించడంతో పాటు భోగి మంటలు వేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. బ్రాహ్మణ వాడలో సాయంత్రం చిన్నారులకు బోగి పండ్లు పోశారు. చిన్నారులకు మంగళ హారతులు ఇస్తూ తలపై చకినాలు, రేగుపండ్లు, నువ్వులతో చేసిన పోకలు, చిక్కుడుకాయలు, అక్షింతలు పోసి ఆశీర్వాదించారు. ఆలయాల్లో గోదారంగనాయకస్వాయి కల్యాణం జరిపించారు. స్వచ్ఛంద సంస్థలు, సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి
సూర్యుని గమనమే సంక్రాంతి. దక్షణాయం నుంచి ఉత్తరాయాణానికి మార్పే సంక్రమణం. ప్రతీ నెలకు ఒక సంక్రమణం ఉంటుంది. సూర్యుని గమన మార్పునకు రంగల్లులు తీర్చిదిద్దడం పండుగ లక్ష్యం. చిన్నారులకు భోగి పండ్లు పోయడం ద్వా రా ఆయురారోగ్యాలు, ఆష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా ప్రజలు సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవాలి. – ఒజ్జల శిరీశ్‌శర్మ, అర్చకుడు, ఆసిఫాబాద్
● జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి ● రంగవల్లులతో కళకళలాడిన


