జంగు సేవలు చిరస్మరణీయం
కెరమెరి: ఆదివాసీ సమాజానికి, స్వగ్రామానికి జంగు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని చిన్నసాకడ గ్రామంలో పెందోర్ జంగుపటేల్ స్మారక కబడ్డీ 26వ వార్షిక క్రీడోత్సవాలకు బుధవారం హాజరయ్యారు. జంగు పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మర్సకోల సరస్వతి, మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం, సర్పంచులు పెందోర్ ఆనంద్‌రావు, తుంరం లచ్చు, కుడ్మెత కొద్దు, కుంరం అంబారావు, ఆత్రం లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.


