‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు శుభాకాంక్షలు
ఆసిఫాబాద్‌రూరల్: గృహజ్యోతి లబ్ధిదారులు, ఉచిత విద్యుత్ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పత్రాలు పంపించారని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడే అన్నారు. ఆ శాఖ అధికారులతో కలిసి బుధవారం మండలంలోని సాలెగూడ గ్రామంలో లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ శుభా కాంక్షల పత్రాలు అందించారు. ఆయన మా ట్లాడుతూ విద్యుత్ అవసరాల కోసం ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, ఆరోగ్యం, కు టుంబ అవసరాల కోసం వినియోగించుకోవా లని సూచించారు. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న 52,82,498 మందికి నేటి వరకు రూ.3,593 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించిందని తెలిపారు. కార్యక్రమంలో డీఈ వీరేశ్, ఏడీఈ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


