హెల్మెట్‌తో ప్రాణాలకు రక్ష
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్‌టౌన్: ద్విచక్ర వా హనదారుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణగా నిలు స్తుందని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్ మండలం మోతుగూడ, కాగజ్‌నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడపడం, మొబైల్ వాడటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. డ్రైవింగ్ సమయంలో అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గతేడాది నుంచి ఇప్పటివరకు 90 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై సుధాకర్, సర్పంచ్ బొట్టుపల్లి గోపాల్, ఉప సర్పంచ్ పవన్, లారీ అసోసియేషన్ సభ్యులు పాలక్‌రావు, వినోద్, పాల్గొన్నారు.


