‘కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగతో కలిసి సమీక్షించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆసిఫాబాద్‌లో తొలిసారి జరిగే ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నారు. ఆశావహులు క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదేశాల ప్రకారం బీఫారం అందిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేశ్, నాయకులు నిజాం, సోమయ్య, శంకర్, గుండా శ్యాం, మారుతి పటేల్, విశ్వనాథ్, ఫైజల్, తారీఫ్, జావిద్, కార్తీక్ పాల్గొన్నారు.


