‘లాల్య..గెంద్యా’తో సేద్యం
కెరమెరి: ‘లాల్యా.. గెంద్యా’.. వినడానికి వింతగా ఉన్నా.. ఇవి కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన సేంద్రియ రైతు కేంద్రె బాలాజీ తన ఎద్దుల జతకు పెట్టుకున్న పేర్లు. దూరంలో ఉన్నా ఈ పేర్లతో పిలిస్తే అవి తన వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అంతేకాక సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బాలాజీకి ఐదెకరాల భూమి ఉండగా, సోదరులకు చెందిన పదెకరాల్లో పత్తి, కంది, గోధుమ, మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటలతోపాటు మామిడి, యాపిల్, బొప్పాయి వంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. ఏటా సేద్యానికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తే రూ.9 లక్షల రాబడి ఉంటుందని ఆయన చెబుతున్నాడు. పొలాల పండుగ సమయంలో ఉపవాసం ఉండి ఎద్దులకు ఆహారం పెట్టిన తర్వాతే తాను తింటానని తన ‘లాల్య..గెంద్యా’తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.


