పులిదాడిలో లేగదూడ మృతి
వాంకిడి: పులిదాడిలో మృతి చెందిన లేగదూడ యజమానికి అటవీ శాఖ అధికారులు తక్షణ నష్టపరిహారం అందజేశారు. అటవీ శాఖ రేంజ్ అధికారి గోవింద్‌చంద్ సర్దార్ వివరాలు వెల్లడించారు. వాంకిడి మండలం వెలిగి సెక్షన్ పరిధిలోని మాలిని గ్రామానికి చెందిన తెలంగ్‌రావు అనే వ్యక్తి లేగదూడ శనివారం సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన సమయంలో సాయంత్రం పులి దాడి చేసి హతమార్చిందన్నారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి తక్షణ నష్ట పరిహారం కింద రూ.5 వేలు అందించామని తెలిపారు. త్వరలో పూర్తి నష్ట పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహంచారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఝాన్సీలక్ష్మి, బీట్ అధికారులు ప్రభాకర్, శ్రీనివాస్, వెంకటేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.


