ఎంతో తృప్తినిస్తోంది
నేను 20 ఏళ్లుగా పిండివంటల తయారీ వ్యాపా రం చేస్తూ పలువురికి ఉపాధి కల్పించడం ఎంతో సంతృప్తినిస్తోంది. పండుగ సమయాల్లో కనీసం మూడు క్వింటాళ్ల సకినాలు, అరిసెలు, చేకోడీలు, సేవు, సాచా, పప్పు బిళ్లలు, చుడ్వా, మురుకులు తయారుచేసి తక్కువ ధరకే విక్రయిస్తుంటాను. ప్రతీరోజు ఇడ్లీ, వడ మొదలైన టిఫిన్స్ కూడా చేస్తుంటాను. దీనిని ఉపాధిగా ఎంచుకున్న నుంచి ఇప్పటివరకు నాణ్యత, పరిమాణం తగ్గించలేదు. ముఖ్యంగా పలహారాల తయారీలో నా భర్త సురేశ్ సహకారం చాలా ఉంది.
– మార స్వరూప, ఆసిఫాబాద్


