ప్రయాణపాట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణపాట్లు

Jan 11 2026 7:44 AM | Updated on Jan 11 2026 7:44 AM

ప్రయా

ప్రయాణపాట్లు

● సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ● కిటకిటలాడుతున్న బస్టాండ్‌లు

ఆసిఫాబాద్‌: జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సమీపిస్తుండడంతో పాఠశాలలు, కళా శాలలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ రోడ్‌, సిర్పూర్‌ (టీ) రైల్వేస్టేషన్లలో వచ్చిపోయే అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు తగినన్ని బస్సులు, రైళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో లేక ఒక్కో బస్సులో సామర్థ్యానికి మించి వెళ్తున్నారు. ఓ వైపు బస్సుల కొరత ఉండగా, మరో వైపు లగేజీతో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. బస్సుల్లో రిజర్వేషన్లు దొరక్క పోవడంతో హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు నాలుగైదు బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఎక్కడం.. దిగడం సమస్యగా మారింది. ఏటా సంక్రాంతి ముందు బస్సుల సమస్య ఉండడంతో కొంతమంది తమ సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ వెళ్లని గ్రామాలకు కూడా ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలు కూడా కిక్కిరిసి వెళ్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు ఐదు ప్రత్యేక బస్సులు వేశారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు రెగ్యులర్‌గా 14 సర్వీసులు నడుస్తుండగా, పండుగ నేపథ్యంలో మరో ఐదు అ దనపు సర్వీసులు నడుపుతున్నారు. కాగా, అదనపు బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌లో పండుగ సందడి

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలోని కిరాణా దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి. జిల్లా కేంద్రం, కాగజ్‌నగర్‌ మున్సి పాలిటీతోపాటు మండల కేంద్రాలు సందడిగా మా రాయి. సంక్రాంతి వంటకాలకు అవసరమైన నువ్వులు, మంచినూనె, బెల్లం, బియ్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. సకినాలు, అరిసెలతో పాటు ఇతర పిండి వంటలు తయారు చేసుకునేందుకు గ్రామాలు, పట్టణాల్లోని అన్ని వర్గాలవారు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పాటు మహిళలు వివిధ నోములు నోముకునేందుకు అవసరమున్న సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు.

విద్యార్థుల ఇంటిబాట

పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో జిల్లాలోని ఆశ్రమ వసతిగృహాలు, కళా శాలల విద్యార్థులు ఇంటి బాట పట్టారు. శనివారం ఉదయం నుంచే విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వసతిగృహాలు, పాఠశాలలకు చేరుకున్నారు. కొంతమంది ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చే సుకోగా, చాలామంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. దీంతో వసతి గృహాలు, బస్టాండ్‌లు సందడిగా మారాయి. ప్రయాణికుల అవసరాన్ని బట్టి కొంతమంది ప్రైవేట్‌ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో చదువుకుంటున్న ఇక్కడి విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఒకటిన్నర చార్జీ వసూలు చేస్తోంది. ఆర్థిక భారమైనప్పటికీ కొంతమంది ప్రయా ణికులు ఇక్కడి నుంచే సొంత వాహనాలు హై దరాబాద్‌కు పంపించి తమ పిల్లలను తీసుకువచ్చారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్సుల్లో రద్దీ పెరగడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. పండుగ సమీపిస్తుండడంతో ఆది, సోమవారాల్లో మరింత ఆదాయం పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు

సంక్రాంతి రద్దీని పురస్కరించుకుని జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్‌ సర్వీసులు నడుపుతున్నాం. రెగ్యులర్‌ సర్వీసులతో పాటు ఈ నెల 14వరకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.

– రాజశేఖర్‌, ఆర్టీసీ డీఎం

ప్రయాణపాట్లు1
1/1

ప్రయాణపాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement