సంక్రాంతి ఉపాధి!
ఆసిఫాబాద్‌అర్బన్: సంక్రాంతి పండుగకు కొద్దిరో జుల ముందునుంచే ఇళ్లల్లో సందడి మొదలవుతుంది. ఏ ఇంట్లో చూసినా ఇంటిల్లిపాది పిండివంటల తయారీలో బిజీబిజీగా కనిపిస్తారు. ఎన్నో పోషకా లు గల సకినాలు, అరిసెలు తదితర పిండివంటలు చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే, కొందరికి ఈ పండుగ ఉపాధినిస్తోంది. సొంతంగా ఇళ్లల్లో పిండివంటలు చేసుకోలేని వారికి రెడీమేడ్‌గా చేసిస్తూ ఎందరో మహిళలు ఉపాధి పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోని మార స్వరూప, బ్రాహ్మణవాడలోని బొగడమీది జయశ్రీ పిండివంటలు తయారు చేసి విక్రయిస్తున్నారు. పిండివంటల తయారీలో మరి కొందరికి ఉపాధినిస్తున్నారు. సంక్రాంతే కా కుండా దసరా, దీపావళి తదితర పండుగలు, ఇతర శుభకార్యాల సమయాల్లోనూ రుచికరమైన పిండివంటలు తయారు చేసి విక్రయించడం వీరి ప్రత్యేకత. వీరు తయారు చేసిన పిండివంటలు స్థానికంగానే కాకుండా ఆర్డర్‌పై విదేశాలకు పంపించడం వీరి మరో ప్రత్యేకత. ఇలా పిండివంటల తయారీని వ్యాపారంగా చేసుకున్న వీరు ఆర్థికంగా రాణిస్తున్నా రు. పిండివంటల తయారీతో మరికొందరు మహిళలకు ఉపాధినిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పల్లెల్లో సందడి
దహెగాం: సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున పల్లెల్లో సందడి మొదలైంది. ఉదయం నుంచే పిండిగిర్నీల వద్ద రద్దీ కనిపిస్తోంది. ప్రతీ ఇంట్లో ఘుమఘుమలాడే పిండివంటలు తయా రు చేస్తున్నారు. శనివారం నుంచి సంక్రాంతి సె లవులు ప్రకటించడంతో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు ఇళ్లకు చేరారు. దీంతో ఇంటిల్లిపాది పిండి వంటల తయారీలో నిమగ్నమయ్యారు. ఎవరికివారే కాకుండా మహిళలు ఒ కరికొకరు సహాయపడుతున్నారు. కబుర్లు చెప్పుకొంటూ అలసట లేకుండా రుచికరమైన సకినాలు, గారెలు, అరిసెలు, చెకోడీలు తదితర వంటకాల తయారీలో బిజీగా కనిపిస్తున్నారు.
సంక్రాంతి ఉపాధి!


