వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తక్షణ మే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సు గుణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ పేదలు, కూలీ లు, రైతుల జీవనాధారంగా ఉన్న ఉపాధిహామీ ప థకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం తీసుకువచ్చిన కొ త్త చట్టాలు ప్రజావ్యతిరేకమని ఆరోపించారు. ఉపాధిహామీ పథకం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబా లకు ఉపాధి లభిస్తోందని తెలిపారు. అలాంటి చ ట్టాన్ని బలహీనపర్చడం అన్యాయమని పేర్కొన్నా రు. వీబీజీ రామ్‌జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20నుంచి 30వరకు జిల్లాలో గ్రామగ్రామాన నిరసనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకుని మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయ క్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, ఆయా మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


