పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

May 20 2025 12:20 AM | Updated on May 20 2025 12:20 AM

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: పదోతరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 7 సెంటర్లలో 2,292 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఇందులో జనరల్‌ 2,057 మంది, ఒకేషనల్‌ 235 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఫస్టియిర్‌ ఉదయం 9 నుంచి 12:30 వరకు సెకండియర్‌ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు నిర్వహిస్తారన్నారు. జూన్‌ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement