కొనుగోళ్లు వేగవంతం చేయాలి
దహెగాం(సిర్పూర్): కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాల ని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు లగ్గాం, హత్తిని, కల్వాడ తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమ శాతం పరిశీ లించారు. అనంతరం మాట్లాడుతూ ఆరబెట్టి న ధాన్యాన్ని కాంటా చేసి వేగంగా మిల్లులకు పంపించాలన్నారు. అకాల వర్షాలతో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీసీవో బిక్కు, డీసీఏవో మహ్మద్, డీటీలు రాజ్‌కుమార్, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.


