
‘లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి’
ఆసిఫాబాద్‌అర్బన్: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు కార్మిక సంఘాలు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. ఉపాధిహామీ, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్ వంటి పథకాలకు అధిక నిధులు కేటాయించాలని కోరా రు. డిమాండ్ల సాధన కోసం జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేందర్, సభ్యులు కృష్ణమాచా రి, వివిధ సంఘాల నాయకులు శ్రీకాంత్, ప్ర భాకర్, కోటయ్య, పద్మ, రాజు, సమ్మయ్య, తిరుపతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.