ప్రారంభం రోజే పంపిణీ! | - | Sakshi
Sakshi News home page

ప్రారంభం రోజే పంపిణీ!

May 21 2025 12:12 AM | Updated on May 21 2025 12:12 AM

ప్రారంభం రోజే పంపిణీ!

ప్రారంభం రోజే పంపిణీ!

ఆసిఫాబాద్‌రూరల్‌: పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల యూనిఫాం వస్త్రం జిల్లాకు చేరుకోగా, కుట్టు పని కోసం మహిళా స్వయం సహాయ సంఘాలకు అందించారు. ఈ నెల 25 వరకు కనీసం ఒక జత యూనిఫాం అయినా సిద్ధం చేయాలని వారిని ఆదేశించింది. ఇక పాఠ్య పుస్తకాల పంపిణీని సైతం వేగవంతం చేసింది. ఇప్పటికే జిల్లాకు 83శాతం పుస్తకాలు చేరుకోగా, మంగళవారం నుంచి ఈ నెల 31లోగా మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు.

జిల్లాకు చేరిన 2,95,530 బుక్స్‌

జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలు(స్థానిక సంస్థలు) ఉన్నాయి. వీటిల్లో 60,779 మంది విద్యార్థులకు అన్నిరకాల పాఠ్య పుస్తకాలు 3,54,570 వరకు అవసరం ఉంటాయి. ఇప్పటి వరకు 2,95,530 పాఠ్యపుస్తకాలు(83 శాతం) జిల్లాకు చేరుకున్నాయి. వీటిని జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో గోదాంలో నిల్వ చేశారు. మరో 59,040 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని డిపో నుంచి మంగళవారం నుంచి బుక్స్‌ పంపిణీని ప్రారంభించారు. ఈ నెల 31 వరకు జిల్లాలోని 15 మండలాల విద్యాధికారులకు అందించనున్నారు. జూన్‌ 10లోగా మండల విద్యాధికారి కార్యాలయం నుంచి పాఠశాలల వారీగా పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

నోటు పుస్తకాలు సైతం..

2025– 26 విద్యా సంవత్సరం నుంచి అన్ని తరగతుల విద్యార్థులకు నోటు పుస్తకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని డిపో నుంచి పంపిణీ చేస్తుండగా, నోట్‌బుక్స్‌ మాత్రం హైదరాబాద్‌ నుంచి నేరుగా ఆర్టీసీ కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమికస్థాయిలో చదివే విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

మండలాల వారీగా..

జిల్లాలోని 60,777 మంది విద్యార్థులకు అందించేందుకు 83 శాతం పాఠ్యపుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా నుంచి ఈ నెల 31 లోపు మండలాల వారీగా పంపిణీ చేస్తాం. బుక్‌ డిపో నుంచి మండల విద్యా వనరుల కేంద్రానికి పుస్తకాలు తరలిస్తున్నాం.

– ప్రకాశ్‌, జిల్లా పాఠ్య పుస్తకాల డిపో మేనేజర్‌

జిల్లాకు చేరిన 83శాతం బుక్స్‌

ఈ నెల 31 వరకు మండలాల వారీగా సరఫరా

పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు అందించేలా కసరత్తు

ఈ ఏడాది అన్ని తరగతులకు నోటుపుస్తకాలు అందజేత

విద్యార్థులకు సకాలంలో అందించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: పాఠశాలలు పునఃప్రారంభం నాటికి సకాలంలో విద్యార్థులకు పా ఠ్యపుస్తకాలు అందించాలని జిల్లా పాఠ్య పు స్తకాల డిపో మేనేజర్‌ ప్రకాశ్‌, ఆసిఫాబాద్‌ ఎంఈవో సుభాశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పుస్తకాల డిపో నుంచి వివిధ మండలాలకు పుస్తకాల పంపిణీని మంగళవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 15 మండలాలకు సంబంధించి 3,54,570 పుస్తకాలకు గాను 2,95,530 పు స్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపా రు. ఈ నెల 31వ తేదీలోపు అన్ని మండలా ల ఎంఈవోలు పుస్తకాలు తీసుకెళ్లాలని సూ చించారు. మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement