బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

Nov 3 2026 12:57 AM | Updated on Nov 3 2026 12:57 AM

సత్తుపల్లిటౌన్‌: సరదాగా వాలీబాల్‌ ఆడిన ముగ్గురు మిత్రులు బిర్యానీ తిని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి శివారు సింగరేణి బైపాస్‌ రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. పెనుబల్లి మండలం లంకపల్లి పరిధి శ్రీనివాసపురానికి చెందిన కొరసా రాము(25) లారీ క్లీనర్‌గా పని చేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. అలాగే, కూలీ పనులతో కుటుంబాన్ని పోషించే పద్దం రాధాకృష్ణ, కాకా నర్సింహారావుతో కలిసి శ్రీనివాసపురంలో వాలీబాల్‌ ఆడారు. ఆ తర్వాత బైక్‌పై సత్తుపల్లికి వచ్చి బిర్యానీ తిన్నాక తిరుగు ప్రయాణమయ్యారు. సింగరేణి బైపాస్‌లోని జీఎం కార్యాలయం సమీప మలుపు వద్ద గుర్తు తెలియని వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన రాము అక్కడికక్కడే మృతి చెందగా, నర్సింహారావు, రాధాకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో 108లో సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, వీరి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. కాగా, మృతుడు రాముకి పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి తిరుపతయ్య, తల్లి అచ్చమ్మతో పాటు ముగ్గురు అక్కాచెల్లెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

ఒకరి మృతి,

మరో ఇద్దరి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement