‘ఆశీర్వాద సభ’కు రూట్‌మ్యాప్‌ | - | Sakshi
Sakshi News home page

‘ఆశీర్వాద సభ’కు రూట్‌మ్యాప్‌

Jun 29 2026 5:34 AM | Updated on Jun 29 2026 5:34 AM

● ప్రాంతాల వారీగా చేరుకోవాల్సిన మార్గాల వెల్లడి ● ప్రత్యేక పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు మార్గాలు, పార్కింగ్‌ స్థలాలు

● ప్రాంతాల వారీగా చేరుకోవాల్సిన మార్గాల వెల్లడి ● ప్రత్యేక పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు

ఖమ్మంక్రైం: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ వద్ద బుధవారం రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల రైతులు, నాయకులు సభావేదిక వద్దకు చేరుకునేలా పోలీసు అధికారులు రూట్‌మ్యాప్‌ రూపొందించారు. ఆయా మార్గాల్లో చేరుకుని నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్‌ చేయాలని వైరా ఏసీపీ సారంగపాణి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పార్కింగ్‌ మ్యాప్‌లను విడుదల చేయగా, అందులోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినా నిర్దేశిత ప్రాంతానికి చేరుకోవచ్చని తెలిపారు.

●పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలతో పాటు ముదిగొండ మండలం నుంచి వచ్చే వారు వెంకటగిరి ఎక్స్‌ వద్ద హైవే ఎక్కి ధంసలాపురం వద్ద దిగి పందిళ్లపల్లి మీదుగా 1 నుంచి 5 వరకు పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలను నిలపాలి.

●కారేపల్లి, కామేపల్లి మండలాల నుంచి వచ్చేవారు ఖమ్మం టౌన్‌ – ముస్తఫానగర్‌ మీదుగా పందిళ్లపల్లికి చేరుకొని 1 నుంచి 5 వరకు పార్కింగ్‌ స్థలాలు వినియోగించుకోవాలి.

●సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాల నుండి వచ్చే వాహనాలు కల్లూరు వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఎక్కి చింతకాని మండలం కొదుమూరు వద్ద దిగి చింతకాని మీదుగా చేరుకున్నాక పార్కింగ్‌ స్థలాలు 7, 8తో పాటు 15లో వాహనాలు పార్క్‌ చేయాలి.

●వైరా, కొణిజర్ల మండలాల నుంచి వచ్చేవారు బస్వాపురం, పెద్ద గోపతి, నేరేడ, చింతకాని మీదుగా చేరుకుని 7, 8తో పాటు 15 నంబర్‌ పార్కింగ్‌ స్థలాలు వినియోగించుకోవాలి.

●ఏన్కూరు, తల్లాడ మండలాల నుంచి వాహనాలు వి.వెంకటాయపాలెం – వందనం – చింతకాని మార్గం ద్వారా వెళ్లి 7, 8, 15నంబర్‌ పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలు నిలపాలి.

●ఎర్రుపాలెం, మధిర, బోనకల్‌, చింతకాని మండలాల నుండి వచ్చే ప్రజలు బోనకల్‌ – నాగలంచ మార్గం ద్వారా చేరుకుని 10, 11, 12, 13, 14 నంబర్‌ పార్కింగ్‌ స్థలాలు వినియోగించుకోవాలి.

●చింతకాని మండలం మత్కేపల్లి నామవరం వైపు ఉన్న ముదిగొండ మండలానికి సంబంధించిన గ్రామాల వారు మత్కేపల్లి క్రాస్‌ నుంచి పందిళ్లపల్లి ద్వారా 1 నుంచి 5 వరకు పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలు నిలిపి సభకు చేరుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement