చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద బుధవారం జరిగే రైతు ఆశీర్వాద సభకు హాజరయ్యే రైతులకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సభ ఏర్పాట్లను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సభకు హాజరు కానున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని తెలిపారు. వర్షసూచనల నేపథ్యాన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, మార్కెట్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, అంబటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, కన్నెబోయిన గోపి, గ్రామసర్పంచ్‌లు కంచం ద్రౌపతి, తాళ్లూరి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు


