ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని చింతకాని మండలంలో బుధవారం జరిగే రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే ఈ సభకు 1.50 లక్షల మంది రైతులు, జనం హాజరవుతారని అంచనా వేశారు. ఈమేరకు హైదరబాద్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి 3లక్షల నీళ్ల బాటిళ్లు తెప్పిస్తున్నారు. అర లీటర్ సామర్థ్యంతో కూడిన ఈ బాటిళ్లు ఆదివారం రాత్రి వరకు 50వేల మేర చేరుకోగా, ఖమ్మంలోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో నిల్వ చేశారు. సోమవారం మిగతా బాటిళ్లు వచ్చాక సభాప్రాంగణానికి చేరుస్తామని అధికారులు వెల్లడించారు.


