కొణిజర్ల: 108 వాహనాల సిబ్బంది సమాచా రం అందగానే సత్వరం స్పందించడం ద్వారా బాధితులకు ప్రాణాలకు భరోసా లభిస్తుందని తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రతినిధులు సూచించారు. కొణిజర్ల ఆరోగ్య కేంద్రంలోని 108 వాహనాన్ని ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఫోన్ వచ్చిన ఎంత సేపట్లో ఘటనాస్థలికి ఏరుతున్నారనే అంశాన్ని రికార్డుల ద్వారా పరిశీలించడమే కాక వాహనంలో పరికరాలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధితులకు వైద్యం అందేలా చూడాలని సూచించారు. అధికారులు బ్రహ్మాఽనందరావు, షేక్ నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


