కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనుల్లో వేగం పెంచి జూలై నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఫ్యాక్టరీ పనులను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించాక మాట్లాడారు. అంజనాపురంలో ఫ్యాక్టరీ మొదలైతే ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు దూరాభారం తగ్గుతుందని తెలిపారు. తహసీల్దార్ ఎన్.అరుణ, ఎంపీడీఓ ఆర్.ఉపేంద్రయ్య, ఆర్‌ఐ నరేష్, సర్పంచ్ ఏ.కమలమ్మ, గోద్రెజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


