గిరిజన గ్రామాలకు రూ.110 కోట్లు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

గిరిజన గ్రామాలకు రూ.110 కోట్లు ఇవ్వండి

Jun 24 2026 12:05 AM | Updated on Jun 24 2026 12:05 AM

రఘునాథపాలెం: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రఘునాథపాలెం మండలంలో గిరిజన గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్ల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మంగళవారం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ప్రతిపాదనలు అందజేశారు. మండలంలోని 37 జీపీలకు గాను 28 ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పరిధిలో ఉండగా, సరైన వరద కాల్వలు, డ్రెయినేజీలు లేక పారిశుద్ధ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈమేరకు వరద నీటి కాలువలు, సమగ్ర డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధం చేసినందున రూ.110 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

కేంద్రమంత్రి చౌహాన్‌కు

మంత్రి తుమ్మల వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement