క్యూఆర్‌ కోడ్‌ ధరలపై కలెక్టర్‌ ఆరా | - | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌ ధరలపై కలెక్టర్‌ ఆరా

Jun 24 2026 12:05 AM | Updated on Jun 24 2026 12:05 AM

ఖమ్మంక్రైం: వాహనాలకు స్టిక్కర్లు అంటించడంతో పాటు క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటుకు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కలెక్టర్‌ దివాకర టీ.ఆస్‌. ఆరా తీశారు. ఈవిషయమై ‘సాక్షి’లో మంగళవారం ‘క్యూఆర్‌ కోడ్‌ పేరుతో దోపిడీ’ శీర్షిక కథనం ప్రచురితమైంది. రవాణా శాఖ కార్యాలయానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ వచ్చే వాహనాలకు స్టిక్కర్లు, క్యూఆర్‌ కోడ్‌ పేరుతో ఇష్టమున్నట్లు వసూలు చేస్తున్నారని తెలియడంతో కలెక్టర్‌ దివాకర స్పందించి ఇన్‌చార్జ్‌ ఆర్‌టీఓ శ్రీనివాస్‌ ద్వారా వివరాలు ఆరా తీశారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ బాధ్యులకు పని అప్పగించినట్లు తెలియగా, సమస్యను రాష్ట్ర కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement