దేశ సమగ్రతకు కృషిచేసిన ముఖర్జీ | - | Sakshi
Sakshi News home page

దేశ సమగ్రతకు కృషిచేసిన ముఖర్జీ

Jun 24 2026 12:05 AM | Updated on Jun 24 2026 12:05 AM

ఖమ్మం మామిళ్లగూడెం: దేశ సమైక్యత, సమగ్రత కోసం రాజీలేని పోరాటం చేసిన డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ సేవలు మరువలేనివని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ‘బలిదాన్‌ దివస్‌’ను మంగళవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటం వద్ద నివాళులర్పించాక కోటేశ్వరరావు మాట్లాడారు. ఈకార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్‌, రవిరాథోడ్‌, నరుకుల వెంకటేశ్వరరావు, భద్రం, బోయినపల్లి సురేష్‌, గుత్తా వంశీ, రుద్రగాని మాధవ్‌, మధు, వీరభద్రం పాల్గొన్నారు.

ఆస్పత్రి నిర్మాణంలో నాణ్యత లోపం

వైరా: వైరాలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విమర్శించారు. ఆస్పత్రి పనులను మంగళవారం నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడారు. 2023లో ప్రారంభించిన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదని పేర్కొన్నారు. నాయకులు రవి రాథోడ్‌, బండారు నరేశ్‌బాబు, సరుకుల వెంకటేశ్వర్లు, వెంకీ యాదవ్‌, మనుబోలు వెంకటకృష్ణ, చింతనిప్పు రామారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement