రైతు మేళా, సీఎం సభకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రైతు మేళా, సీఎం సభకు ఏర్పాట్లు

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

20ఎకరాల్లో సభ, ఐదెకరాల్లో స్టాళ్లు

అధికారులతో సమీక్షలో

కలెక్టర్‌ దివాకర

ఖమ్మం సహకారనగర్‌: ఈనెల 28, 29వ తేదీల్లో నిర్వహించే రైతు మేళా, 30వ తేదీన చింతకాని మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యే సభకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సీఎం హాజరయ్యే సభ కోసం 25ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయగా, ఇందులోని 20 ఎకరాల్లో సభ నిర్వహణకు కేటాయించినట్లు తెలిపారు. మిగతా ఐదెకరాల్లో వ్యవసాయ సంబంధిత శాఖల ద్వారా 150 స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇక సభా ప్రాంగణంలో ఏర్పాట్లు, పార్కింగ్‌, రూట్‌ మ్యాప్‌లు సిద్ధం చేయడంపై దృష్టి సారించాలని తెలిపారు. సీపీ సునీల్‌దత్‌ మాట్లాడుతూ గుర్తించిన స్థలాన్ని సిద్ధం చేయడమే కాక, రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ అనూజ్‌ అగర్వాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలి

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలపై సమగ్ర నివేదికలతో జిల్లా అధికారులు సమీక్షకు సిద్ధం కావాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. ఈ కార్యక్రమంలో చేపట్టిన పనులు, సాధించిన పురోగతిపై మంగళవారం ప్రత్యేక అధికారితో సమీక్ష ఉంటుందని తెలిపారు. ఈమేరకు వివరాలు, ఫొటోలతో నివేదిక సిద్ధం చేసి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందనాన్రు. ఈసమావేశంలో సీపీఓ శ్రీనివాస్‌, డీఆర్డీఓ శ్రీరామ్‌, సంక్షేమ శాఖల అధికారులు జ్యోతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement